ETV Bharat / jagte-raho

కుక్కల గోల భరించలేకపోతున్నాం.. అపార్టుమెంట్​వాసుల ఆందోళన - complaint on street dogs

హైదరాబాద్​ నాచారం పోలీస్​స్టేషన్​ పరిధిలోని సాయిదర్శన్​ అపార్ట్​మెంట్​ వాసులు.. అక్కడే ఉంటున్న గీతిక దత్త పెంచుకుంటున్న కుక్కల గోల భరించలేకపోతున్నామంటూ ఫిర్యాదు చేశారు. అధికారులు ఎలాగైనా ఆ కుక్కల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.

apartment residents complaint about dogs in colony
కుక్కల బెడద నుంచి కాపాడండి అంటూ అపార్ట్​మెంట్​వాసులు ఆందోళన
author img

By

Published : Aug 27, 2020, 12:02 PM IST

కుక్కల గోల భరించలేకపోతున్నామంటూ హైదరాబాద్ నాచారం పోలీస్​స్టేషన్​ పరిధిలోని సాయిదర్శన్ ఆపార్ట్​మెంట్​లో నివసిస్తున్న గీతిక దత్త అనే మహిళపై ఫిర్యాదు ఇచ్చారు అపార్ట్​మెంట్​వాసులు. గీతిక గత 16 సంవత్సరాలుగా కుక్కలను పెంచుకుంటోంది. అయితే ఆమె పెంచుకుంటున్న 20 కుక్కల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందంటూ అపార్ట్​మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. కుక్కలు చేస్తున్న మలవిసర్జన వల్ల దుర్వాసన ఎక్కువైపోతోందని.. రాత్రి పూట వాటి అరుపులతో సరిగా నిద్రపోలేకపోతున్నామని వాపోతున్నారు.

కుక్కల బెడద నుంచి కాపాడండి అంటూ అపార్ట్​మెంట్​వాసులు ఆందోళన

వారం రోజుల క్రితం 6 కుక్కలను ఎంసీహెచ్​ డాగ్​ స్క్వాడ్​ వారు తీసుకెళ్లారని.. అయితే వాటిని మళ్లీ తీసుకువచ్చారని అపార్ట్​మెంట్ వాసులు పేర్కొన్నారు. కుక్కలను ఎట్టి పరిస్థితుల్లో అపార్ట్​మెంట్​లోకి రానివ్వమని అందరూ కలిసి భీష్మించుకు కూర్చున్నారు. ఈ కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.