ETV Bharat / jagte-raho

హేమంత్​ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు - హేమంత్ హత్య కేసు అప్​టేడ్​

హేమంత్​ హత్య కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్టు మాదపూర్​ ఇంఛార్జ్​ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. హత్యకు కుదుర్చుకున్న ఒప్పందంపై ఆరా తీయనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు కొవిడ్ సోకడం వల్ల రాయదుర్గం ఇన్స్​స్పెక్టర్​ దర్యాప్తు కొనసాగించనున్నట్టు తెలిపారు.

another two members arrested in hemanth murder case
హేమంత్​ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు
author img

By

Published : Oct 21, 2020, 2:48 PM IST

హైదరాబాద్​లో సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 12 మందిని కస్టడీలోకి తీసుకొని విచారణ పూర్తి చేసిన పోలీసులు... మొదట సుపారి ఇచ్చిన ముఠాలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వీరిని కస్టడీలోకి తీసుకుని యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి కుదుర్చుకున్న ఒప్పందంపై ఆరా తీయనున్నారు. వీరిద్దరితో పాటు బిచ్చు యాదవ్, మహ్మద్ పాషా అలియాస్ లడ్డు, ఎరుకల కృష్ణతో సీన్ రీకన్ట్రక్షన్ చేసిన పోలీసులు... కేసులో దర్యాప్తు పూర్తి చేసి అభియోగ పత్రాలు సిద్దం చేస్తున్నారు.

కేసు ట్రయల్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం సీపీ సజ్జనర్ న్యాయస్థానానికి లేఖ రాశారు. అది ఏర్పాటయితే వెంటే అభియోగపత్రాలు న్యాయమూర్తికి సంమర్పించి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూస్తామని మాదాపూర్​ ఇంఛార్జ్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇద్దరు గచ్చిబౌలి ఇన్స్​స్పెక్టర్లకు కొవిడ్ సోకడం వల్ల... రాయదుర్గం ఇన్స్​స్పెక్టర్​ రవీందర్ దర్యాప్తు కొనాగిస్తున్నారని వివరించారు.

ఇదీ చదవండి: అమరుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటాం: సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.