ETV Bharat / jagte-raho

సరూర్​నగర్​ వ్యాపారి కిడ్నాప్​ కేసులో మరో వ్యక్తి అరెస్ట్​ - జగిత్యాల జిల్లా చెప్యాలలో కిడ్నాపర్​ అరెస్టు

సరూర్​నగర్ వ్యాపారి తాట్ల నాగభూషణం కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా చెప్యాల గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు.

another kidnaper of saroornagar kidnap case were arrested by jagityal chepyala police
సరూర్​నగర్​ వ్యాపారి కిడ్నాప్​ కేసులో మరో వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Oct 6, 2020, 1:15 PM IST

హైదరాబాద్​కు చెందిన తాట్ల నాగభూషణం కిడ్నాప్​ కేసులోని ఐదుగురు కిడ్నాపర్ల ముఠాలో దొంగలమర్రి చెకపోస్ట్ వద్ద స్థానిక పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. కాగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కిడ్నాపర్ల ముఠాకు చెందిన మరొక వ్యక్తిని మంగళవారం చెప్యాల గ్రామస్థులు పట్టుకున్నారు.

పొంతనలేని సమాధానాలతో...

గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతన్ని స్థానికులు వాకబుచేయగా... పొంతన లేని సమాధానాలు చెప్పటంతో పోలీసులకు సమాచారం అందించారు. దీనితో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా బంధించి వారికి అప్పగించారు. అతన్ని హైదరాబాద్​కు చెందిన బడా నాగరాజ్​గా గుర్తించారు. మరో నిందితుడు క్రాంతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: నకిలీ పోలీసు మోసం.. రూ.9 లక్షలు వసూలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.