ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియని మృతదేహన్ని గోపాలపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని మనోహర్ థియేటర్ వెనుకవైపు ఓ వ్యక్తి చనిపోయారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు.
అతని ఒంటిపై పర్పుల్ కలర్ జాకెట్, నీలం రంగు చొక్కా, బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.