కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామ శివారులోని రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన మాసుల సత్యనారాయణగా గుర్తించారు. మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు మృతుడిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: అంబులెన్స్ ఢీ.. అనంతలోకాలకు ఛత్తీస్గఢ్ యువకుడు!