ETV Bharat / jagte-raho

హృదయ విదారక ఘటన : మృతదేహంపై పందుల దాడి - an old woman begger died in achampet bus stand

నిలవనీడ లేని ఓ వృద్ధురాలు భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. బస్టాండ్​ ఆవరణనే వసతిగా చేసుకుంది. రాత్రిళ్లు అక్కడే నిద్రించేది. అసలే చలికాలం.. ఆ చలికి తట్టుకోలేక పోయిన ఆమె నిద్రలోనే మృతి చెందింది. ఆ మృతదేహంపై పందులు దాడి చేసి పీక్కు తిన్నాయి. కంట తడి పెట్టించే ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటు చేసుకుంది.

an old woman begger died in achampet bus stand pigs assaulted on dead body
హృదయ విదారక ఘటన: వృద్ధురాలి మృతదేహంపై పందుల దాడి
author img

By

Published : Dec 13, 2020, 5:27 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వృద్ధురాలి దేహంపై పందులు దాడి చేసి పీక్కు తిన్నాయి. భిక్షాటన చేస్తూ పొట్ట పోషించుకుంటున్న ఓ అనాథ వృద్ధురాలు.. బస్టాండ్​ ఆవరణలోనే సేద తీరేది. రాత్రిళ్లు అక్కడే నిద్రించేది. శనివారం రాత్రి చలికి తట్టుకోలేక పోయిన ఆమె.. మృతి చెందింది. ఆ రాత్రి మృతదేహంపై పందులు దాడి చేసి శరీర భాగాలను తిన్నాయి.

తెల్లవారు జామున వృద్ధురాలి మృతదేహం వద్ద పందులు ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఈ విషాద ఘటన స్థానికులను కంట తడి పెట్టించింది. కాగా చలికి తట్టుకోలేక వృద్ధురాలు మృతి చెందిందా.. లేక ఆమె నిద్రిస్తుండగా పందులు దాడి చేశాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.