సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పాండవుల చెరువులో ప్రమాదవశాత్తు పడి లక్ష్మి అనే మహిళ మృతి చెందింది.
పట్టణంలోని 9వ వార్డుకు చెందిన బాకి లక్ష్మి అనే మహిళకు మతి స్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కాసేపటికి మేలుకువ వచ్చిన కుటుంబ సభ్యులు లక్ష్మి కోసం అర్ధరాత్రి వరకు వెతికారు. ఎక్కడా కనిపించకపోవడం వల్ల తిరిగి ఇంటికి వెళ్లారు.
తెల్లవారుజామున పాండవుల చెరువులో మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు లక్ష్మిగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.