ETV Bharat / jagte-raho

రెండు వాహనాలను ఢీకొట్టిన అంబులెన్స్.. ఇద్దరికి తీవ్ర గాయాలు - కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న అంబులెన్స్

హోండాసిటీ కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఓ అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు బీటెక్ విద్యార్థులకి తీవ్ర గాయలయ్యాయి. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం వల్ల కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.

ambulance-collided-with-two-vehicles-two-people-seriously-injured-in-libarty-road-in-hyderabad
రెండు వాహనాలను ఢీకొట్టిన అంబులెన్స్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
author img

By

Published : Feb 7, 2021, 10:13 PM IST

హైదరాబాద్ తెలుగుతల్లి పైవంతెన కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లిబర్టీ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వైపు వెళ్తున్న హోండాసిటీ కారుతో పాటు మరో ద్విచక్ర వాహనాన్ని.. లక్డీకపూల్ నుంచి ట్యాంక్​బండ్ వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న సాయిచరణ్, బాలచందర్​కు తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఎంఎస్ మక్తాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. వీరిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడం వల్ల కారులో ఉన్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు.

బాన్సువాడకు చెందిన శంకర్ అనే వ్యక్తి ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడగా మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం అతను చనిపోగా.. మృతదేహంతో అంబులెన్స్​లో బాన్సువాడకు బయల్దేరారు. తెలుగు తల్లి పైవంతెన వద్దకు రాగానే సిగ్నల్ ఉన్నప్పటికీ వేగంగా వచ్చి కారును, ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్ ఢీకొట్టింది. అతి వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: పోలీసుల చేతిలో తాళాలు.. ఇంటిని గుల్ల చేసిన దొంగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.