ETV Bharat / jagte-raho

ప్రేమపెళ్లైనా అదనపుకట్నం వేధింపులు... భార్యపై కత్తితో దాడి - అదనపు కట్నం వేధింపులు తాజా వార్త

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లు తిరగకుండానే అదనపు కట్నం కోసం వేధించసాగాడు. భార్య రాజీకి రాకపోవడం వల్ల ఆమెపై కత్తితో దాడి చేశాడు.. చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Additional dowry harassment in Vikarabad district, man arrested for attack with knife on wife
ప్రేమపెళ్లైనా అదనపుకట్నం వేధింపులు... భార్యపై కత్తితో దాడి
author img

By

Published : Oct 3, 2020, 1:45 PM IST

వికారాబాద్​ జిల్లాలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్న భార్యపై భర్త కత్తితో దాడిచేసి పరారయ్యాడు.

వివరాల్లోకెళ్తే...

హైదరాబాద్ నగరం నాంపల్లికి చెందిన వెంకటేష్ గౌడ్, శంకర్​పల్లి మండలం అంతప్పగూడకు చెందిన సుజాతలు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండేళ్లు తిరగకుండానే వెంకటేశ్​ సుజాతను అదనపు కట్నంకోసం వేధించసాగడు. దానితో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనిపై కేసు నమోదుచేయించింది. అప్పటి నుంచి వారిరువురూ ఎడమొహం పెడమొహంగా జీవిస్తున్నారు.

కేసును వాపసు తీసుకోవాలంటూ వెంకటేశ్​ సుజాతను చాలాసార్లు అడగగా ఆమె దానికి నిరాకరించింది. కోపంతో అతను గురువారం రాత్రి వికారాబాద్​లోని ఓ బట్టల దుకాణంలో పనిచేసుకుంటూ జీవిస్తున్న సుజాతపై కత్తితో దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు వెంకటేశ్​ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు డీఎస్పీ సంజీవరావు తెలిపారు.
ఇదీ చూడండి: వాట్సప్​ స్టేటస్​లో పడకగది ఫొటోలు... భార్య ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.