ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు జరిగాయి. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి స్వగ్రామం అయిన గొల్లప్రోలుకు తరలించారు.
సీరియళ్లలో నటిస్తూ... మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్న శ్రావణి... ఇలా ఆత్మహత్య చేసుకుంటుంది అనుకోలేదంటూ... ఆమె బంధువులు బోరున విలపించారు. ఆమె మృతికి కారకుడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న సాయి కృష్ణ కూడా... కుటుంబ సభ్యులతో పాటు గొల్లప్రోలులో అంత్యక్రియలకు హాజరయ్యాడు.
ఇదీ చదవండి: ఆరు గంటలకుపైగా విచారణ... అన్ని కోణాల్లో దర్యాప్తు