కొందరు వ్యక్తిగతంగా తనపై టార్గెట్ చేసి.. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ సినీనటి మాధవీలత వాపోయారు. ఈ విషయంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
భాజపాలో చేరినప్పటి నుంచి ఓ వర్గానికి చెందిన సభ్యులు తనపై టార్గెట్ చేసి... అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్నారని నటి మాధవీలత తెలిపారు. ఏమైనా కేసుల్లో అమ్మాయిలు పట్టుబడితే.. వాటిలో నేను ఉన్నట్లు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అసభ్యమైన పోస్టులతో మానసికంగా కుంగదీస్తున్నారని... శక్తి ఉన్నంత వరకు పోరాడానని పేర్కొన్నారు. చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించానని... తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు మాధవీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పట్టపగలే చోరీ.. రూ. 20వేల విలువగల చీరలు స్వాహా