రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో తండ్రిని చంపేసి ఇంట్లోనే ఉన్న నిందితున్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. తండ్రిని కత్తితో పొడిచి చంపిన నిందితుడు అంజయ్య... మత్తు పదార్థం స్వీకరించి తలుపులు పెట్టుకుని ఇంట్లోనే ఉన్నాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా... లాభం లేకపోయింది.
పోలీసులను ముప్పు తిప్పలు పెట్టగా... ఆక్టోపస్ వారిని సైతం రప్పించారు. 6 గంటలపాటు శ్రమించిన పోలీసులు... చివరికి పెప్పర్ స్ప్రేను ఇంట్లోకి పంపించారు. తట్టుకోలేని నిందితుడు బాత్రూం గోడపై నుంచి భవనంపైకి ఎక్కాడు. ఫైర్‌ఇంజన్‌తో వాటర్ కొట్టి నిందితుని మత్తు వదలగొట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిందితున్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.