అతివేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు యువకులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కోట్‌పల్లి ప్రాజెక్టును చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు కారులో వికారాబాద్‌లోని మిత్రుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆరుగురు యువకులు అనంతగిరి కోట్‌పల్లి ప్రాజెక్టును చూసేందుకు వెళ్తుండగా.. అనంతగిరి ఘాట్ రోడ్డు మలుపులో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
కారులో ఉన్న పవన్, ముఖేశ్‌లు తీవ్రంగా గాయపడగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరిని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన పవన్, ముఖేశ్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కిటికీ ఊచలు కట్ చేసి చోరీ.. బంగారం,వెండి,నగదు అపహరణ