మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధి చింతల్లో సుమలత అనే మహిళ (35)ను గుడ్డిగా పరుగెడుతూ రోడ్డు దాటుతుండగా.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు ప్రసాద్(20) ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ప్రసాద్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో పాదచారులకు పై వంతెన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గాంధీ ఆసుపత్రికి అఖిలప్రియ.. పరారీలో ఆమె భర్త