మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన అనిశా అధికారులు ఏకకాలంలో 35 చోట్ల సోదాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని నరసింహారెడ్డి ఇంటితోపాటు... ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నర్సింహారెడ్డికి చెందిన సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారం, వెండి ఆభరణాలను అనిశా అధికారులు గుర్తించారు. సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు
వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపూర్‌లోని నరసింహారెడ్డి బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి అక్కడ కూడా సోదాలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేశాడు. స్పెషల్ పార్టీలో పనిచేస్తున్న సమయంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేరు మోసిన గొలుసు దొంగ శివ ఎన్కౌంటర్ చేసిన బృందంలోనూ ఉన్నాడు. 2008 నుంచి 2010 వరకు మియాపూర్ సీఐగా ఉన్నప్పుడు అనేక భూ వివాదాల్లో తలదూర్చినట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి: మూడో రోజు విచారణ.. నగేశ్ బ్యాంకు లాకర్ తెరిచే అవకాశం