ఏసీబీ వలలో మరో రెవెన్యూ అధికారి చిక్కాడు. భూమికి సంబంధించి సర్వేనివేదిక ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వేయర్ వెంకటేశ్వర్ రెడ్డిని అనిశా అధికారులు పట్టుకున్నారు. భూ సర్వే నిర్వహించి దానికి సంబంధించిన నివేదిక ఇవ్వడానికి... భూయజమాని వద్ద అయిదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు.
దీనితో భూ యజమాని అనిశా అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి నుంచి అయిదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఇదీ చూడండి: బాలానగర్లో యజమాని వద్ద నగదు దొంగలించిన వ్యక్తి అరెస్ట్