ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న అభియోగాలతో అరెస్టైన ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. న్యాయస్థానం అనుమతితో ఆయనను విచారిస్తున్న అనిశా అధికారులు... కీలక ఆధారాలను సేకరించారు.
తన స్నేహితురాలితో కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫ్లాట్లు, స్థలాలు వాటిని తనఖా ఉంచి బ్యాంకుల్లో తీసుకున్న రుణాల వివరాలను పరిశీలిస్తున్నారు. మాదాపూర్లో నివాసముంటున్న ఆమె... నర్సింహరెడ్డి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆయనకు పరిచయమైంది.
ఏసీపీ నరసింహరెడ్డి సన్నిహితురాలు వ్యక్తిగత పర్యటన నిమిత్తం రెండు నెలల క్రితం అమెరికాకు వెళ్లిందని అనిశా అధికారులు తెలుసుకున్నారు. అక్కడుంటున్న రక్త సంబంధీకులను కలుసుకునేందుకు ఒక్కతే వెళ్లిందని ఆమె భర్త అనిశా అధికారులకు వివరించారు.
ఆదాయపు పన్ను, ఇతర కారణాల వల్ల తన పేరుమద ఆస్తులు కొనుగోలు చేస్తున్నాని... రుణాలు తీసుకుని వ్యాపారాలు నిర్వహించడం లేదా ధరలు పెరిగాక విక్రయించి లాభాలు తీసుకుందామని ఏసీపీ అన్నట్లుగా ఆమె భర్త వెల్లడించారు. ఆమె రాగానే మరిన్ని వివరాలు చెబుతారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: బినామీ ఆస్తుల గురించి దాటవేసిన ఏసీపీ నర్సింహారెడ్డి