ETV Bharat / jagte-raho

కీసర తహసీల్దార్​ కేసులో అనిశా సోదాలు ముమ్మరం - కీసర తహసీల్దార్​ కేసులో దర్యాప్తు ముమ్మరం

వివాదస్పద భూమి విషయంలో రంగారెడ్డి జిల్లా కీసర తహసీల్దార్​ నాగరాజు లంచం డిమాండ్​ చేసిన కేసులో అనిశా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన స్థిరాస్తి వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు.

కీసర తహసీల్దార్​ కేసులో అనిశా సోదాలు ముమ్మరం

author img

By

Published : Aug 17, 2020, 10:58 PM IST

రంగారెడ్డి జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో అనిశా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులు అంజి రెడ్డి, శ్రీనాథ్, యుగంధర్ ఇళ్లు, కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు చేస్తున్నారు. వివాదాస్పద భూమిని కైవసం చేసుకోవడానికి అంజి రెడ్డి, శ్రీనాథ్ కలిషి తహసీల్దార్ కు కోటి 10 లక్షల రూపాయల లంచం ఇచ్చారు. ఇంత డబ్బు ఎలా సమీకరించారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో నాగరాజు అవినీతి అక్రమాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

కోట్ల రూపాయల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారుల పేరు మీద మార్చడానికి రెండు కోట్ల రూపాయలు తహసీల్దార్ నాగరాజు డిమాండ్ చేశాడు. అంజి రెడ్డి, శ్రీనాథ్ ఇచ్చిన లంచానికి సంబంధించి అనిశా అధికారులు ఆదాయవు పన్ను అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇంకా ఎవరైనా వీరి వెనక ఉన్నారా అనే కోణంలో అనిశా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. తహసిల్దార్ నాగరాజు ఇల్లు, కార్యాలయంలో దొరికిన విలువైన ఆస్తులు, భూమి పత్రాలపై ఆరా తీస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.