ETV Bharat / jagte-raho

రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులు.. మాజీ అదనపు కలెక్టర్‌ నగేశ్‌పై మరో కేసు - Medak former Additional Collector Nagesh case

Medak former Additional Collector Nagesh
రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులు.. మెదక్‌ మాజీ అదనపు కలెక్టర్‌ నగేశ్‌పై మరో కేసు
author img

By

Published : Oct 4, 2020, 7:06 PM IST

Updated : Oct 4, 2020, 8:20 PM IST

19:04 October 04

రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులు.. మాజీ అదనపు కలెక్టర్‌ నగేశ్‌పై మరో కేసు

    మెదక్​ పూర్వ అదనపు కలెక్టర్ నగేశ్​పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయింది. రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులను నగేశ్​ కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.  

    మేడ్చల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్​లో నగేశ్​కు ఆస్తులు ఉన్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. డ్యూప్లెక్స్ విల్లా, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, కార్లతో పాటు బ్యాంకులో నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగేశ్​ బినామీ ఆస్తుల కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు అనిశా అధికారులు తెలిపారు.

     నర్సాపూర్ మండలం చిప్పల్​తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి నగేశ్​.. కోటీ 12 లక్షలు లంచం తీసుకున్నారు. ఈ కేసులో నగేశ్​తో పాటు ఆర్డీవో అరుణరెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం, జీవన్​గౌడ్​లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు చంచల్​గూడ జైల్లో రిమాండ్​ ఖైదీలుగా ఉన్నారు.  

ఇవీచూడండి:  అదనపు కలెక్టర్​ నగేశ్​.. ఖైదీ నంబర్​ 9444

Last Updated : Oct 4, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.