ETV Bharat / jagte-raho

మిర్యాలగూడలో అనిశాకి చిక్కిన సైట్ ఇంజినీర్

మిర్యాలగూడలో విద్యాశాఖ సైట్​ ఇంజినీర్ అనిశాకు చిక్కారు. గుత్తేదారు నుంచి రూ.80వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు. పట్టణంలోని ఆయన ఇంట్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

acb caught site engineer for corruptions at miryalaguda in nalgonda
మిర్యాలగూడలో అనిశాకి చిక్కిన సైట్ ఇంజినీర్
author img

By

Published : Dec 5, 2020, 11:58 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్యాశాఖ సైట్ ఇంజినీర్ స్వామి నాయక్ ఏసీబీ వలలో చిక్కారు. గుత్తేదారు నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. ఆశ్రమ పాఠశాలలో నీటి సంపు నిర్మాణం జరిపిన గుత్తేదారు నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా... తెలంగాణ విద్యా శాఖ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కార్పొరేషన్ సైట్ ఇంజినీర్ ఇస్లావత్ స్వామి నాయక్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

నేరేడుగొమ్మ మండలం బచ్చాపురం గ్రామానికి చెందిన గుత్తేదారు కేతావత్ సోమ్లా నాయక్ పెద్దవూర మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో 2019లో మురుగు కాలువ, నీటి ట్యాంకు నిర్మించారని అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. అందుకు రూ.4,25,000 పనులు పూర్తి చేయగా... ఏడాది కాలంగా సైట్ ఇంజనీర్ స్వామి నాయక్ బిల్లు చేయకుండా నిలిపివేశారన్నారు. రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారని వెల్లడించారు.

అనిశాని ఆశ్రయించిన సోమ్లా నాయక్... వారి సూచనతో రూ.80వేలు ఇచ్చేందుకు అంగీకరించగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో డబ్బులు ఇవ్వాలని కోరారు. మధ్యాహ్నం సమయంలో గుత్తేదారు సోమ్లా నాయక్ స్థానిక రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట రూ.80 వేలు నగదు ఇస్తుండగా... సైట్ ఇంజినీర్ స్వామి నాయక్ తీసుకుని జేబులో పెట్టుకున్నారని అన్నారు. అదే సమయంలో స్వామి నాయక్​ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఆనంద్ తెలిపారు. పట్టణంలోని కృష్ణా కాలనీలోని స్వామి నాయక్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇన్​స్పెక్టర్ వెంకట్, మురళీమోహన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కల్తీ ఇంజిన్ ఆయిల్​ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.