మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని వైష్ణవి కన్స్ట్రక్షన్లో ట్రాన్స్ఫార్మర్స్, మీటర్ల కోసం బాధితుడు శశికుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్స్, మీటర్లు మంజూరు కావాలంటే రూ.13 వేలు ఇవ్వాలని సబ్ ఇంజినీర్ విజయేందర్ రెడ్డి బాధితుడికి చెప్పారు. ఈ విషయమై శశికుమార్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విజయేందర్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఒక్కొక్క అధికారికి లక్షల్లో జీతాలు ఉన్నా ఇలా అవినీతికి పాల్పడడం దారుణమని బాధితుడు అన్నారు.
ఇదీ చదవండి: డబ్బులు కావాలని ఫేస్బుక్లో ఎస్పీ మెస్సేజ్!