మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని అనిశా కార్యాలయానికి తరలించారు. రేపు ఉదయం అరెస్టు చేసి అనిశా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై ఏసీపీ నివాసం సహా ఆయన బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేశారు. పలు భూవివాదాల్లో తలదూర్చడం సహా సెటిల్‌మెంట్లు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏకకాలంలో 25 చోట్ల తనిఖీలు చేపట్టింది.
వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపురంలోనూ తనిఖీలు చేసిన అధికారులు.. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భవనాలు ఉన్నాయనే కోణంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో సుమారు రూ.70కోట్ల ఆస్తులను ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : అవినీతి తిమింగళం: ఏసీపీ ఇంట్లో సోదాలు.. రూ.70 కోట్ల ఆస్తులు