సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి నల్ల బాబు అనే యువకుడు మృతి చెందాడు. బాబు తన స్నేహితులతో కలిసి అమ్ముగూడా రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు వెళ్లాడు. బాబుకు సరిగా ఈత రాకపోవడం వల్ల ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. ఫలితంగా బాబు అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాబు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి.. ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్