కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన మహేశ్(22) ఆన్లైన్ గేమ్‌కు ఆకర్షితుడయ్యాడు. ఉన్నచోటే డబ్బులు సంపాదించాలనే అతివిశ్వాసంతో గేమ్‌ను ప్రారంభించాడు. చివరకు ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆర్థికంగా నష్టపోయి తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. ఆన్లైన్ గేమ్‌లతో యువత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: కారు నేర్చుకుంటూ.. కానరాని లోకాలకు..