జగిత్యాలకు చెందిన యువ దంపతులు బూసి విజయ్, వస్మిత... దేశంలోని పలు పర్యాటక కేంద్రాలను తిరగాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 10న జగిత్యాలలో ప్రారంభమైన వీరి యాత్ర... నెల రోజులపాటు 7 రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో సాగింది. రోజుకు 12 గంటలు ప్రయాణించిన ఈ జంట... రాత్రిళ్లు హోటళ్లో బస చేసేవారు. తమ ప్రయాణంలో చాలా ఇబ్బందులు, సవాళ్లను అధిగమించి గమ్యాన్ని చేరామని తెలిపారు.
యూట్యూబ్‌లో చూసి...
ఇలాంటి సాహసయాత్ర చేయడానికి ఒక కారణం ఉందని ఈ జంట చెబుతోంది. విజయ్-శ్వేత అనే యువ జంట దేశంలోని అనేక ప్రదేశాలను సందర్శిస్తారని యూట్యూబ్‌లో చూసి తామూ ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. విజయ్-శ్వేత దంపతులను యూట్యూబ్‌లో అనుసరిస్తూ వీరి ప్రయాణం సాగింది. విజయ్-వస్మిత దంపతులకు మార్గమధ్యలో విజయ్-శ్వేత జంట కలిసింది. వీరంతా కొంత దూరం ప్రయాణించి... వారితో కొంత సమయం గడిపారు.
బైక్ రైడింగ్ తమకు మంచి అనుభూతిని ఇచ్చిందని ఈ యువదంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను చుట్టొచ్చినట్లు వెల్లడించారు.