ETV Bharat / jagte-raho

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్... ఒకరి పరిస్థితి విషమం - ఆటోను ఢీకొన్న ట్రాక్టర్ నలుగురికి తీవ్రగాయాలు

అందరూ కలిసి సంతోషంగా పెళ్లి విందులో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను ట్రాక్టర్​ ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్​నగర్​ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్​కు తరలించారు.

A tractor that collided with an auto one's condition is critical in nalgonda road accident
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్... ఒకరి పరిస్థితి విషమం
author img

By

Published : Dec 20, 2020, 10:46 PM IST

పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఆటోను ట్రాక్టర్​ ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్​నగర్​ వద్ద ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బి.అన్నారం గ్రామానికి చెందిన నాగరాజు తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్​కు తరలించారు.

తిరుమలగిరి మండలం రాజవరంలో వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అదేమార్గంలో ఆటో వెనకాలే వస్తున్న ద్విచక్రవాహనదారుడు ఆటోను ఢీకొట్టి గాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వెదసాగులో మెలకువలు నేర్చుకోండి: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.