ETV Bharat / jagte-raho

పోలీసుల స్పెషల్ డ్రైవ్.. బుల్లెట్​లపై జరిమానా - Bhadradri Kottagudem District Latest News

భారీ శబ్దాలు చేస్తూ బుల్లెట్ వాహనాలపై అతివేగంతో తిరుగుతున్న ఆకతాయిలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సైలెన్సర్​లు తొలగించి జరిమానా విధించారు. పరిస్థితి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Police removing silencers
సైలెన్సర్​లు తొలగిస్తున్న పోలీసులు
author img

By

Published : Jan 17, 2021, 3:51 PM IST

శబ్ద కాలుష్యం చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై సురేశ్​ హెచ్చరించారు. సిబ్బందితో కలిసి స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

భద్రాచలం పట్టణంలో బుల్లెట్ ద్విచక్ర వాహనాలకు ఉన్న సైలెన్సర్​లను పరిశీలించారు. ఎక్కువ శబ్దం వచ్చే వాటిని తొలగించేస్తున్నారు. జరిమానా విధిస్తున్నారు.

కఠిన చర్యలు..

భద్రాచలం ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 10మంది వాహన దారులకు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించారు. పరిస్థితి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ఎస్సై సురేశ్​ను పట్టణ ప్రజలు అభినందించారు.

ఇదీ చూడండి: ఆస్పత్రి భవనంపై నుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.