ETV Bharat / jagte-raho

ఏపీలో ఐదేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారయత్నం - కడప జిల్లా నేర వార్తలు

అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై కామాంధుడి కళ్లు పడ్డాయి. ఇంట్లో ఒంటరిగా కనిపించిన చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడు. బాధితురాలి కుటుంబసభ్యులు రావటం వల్ల అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది.

a-sixteen-year-old-boy-rape-attempt-on-five-year-old-girl-in-kadapa-district
ఏపీలో ఐదేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారయత్నం
author img

By

Published : May 29, 2020, 9:42 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సుండుపల్లి మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి యత్నించాడు. రోజూ ఇంటికి వచ్చి చిన్నారికి తినుబండారాలను పెట్టేవాడు అతను. గురువారం కూడా ఇంట్లోకి వచ్చిన ఆ కామాంధుడికి ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా కనిపించింది.

బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. అంతలోనే ఇంటి వారు రావటం వల్ల అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు సుండుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి ప్రయత్నించిన బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భక్తవత్సలం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బోర్​ వెల్​ విషాదం... బాలుడికి అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.