ETV Bharat / jagte-raho

ఉరితో ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చీర ఉయ్యాల - latest news on A seven-year-old child's deid due to saree in khammam

చీరతో కట్టిన ఉయ్యాలలో ఆడుకుంటుండగా అదే చీర మెడకు బిగుసుకుని ఓ చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

A seven-year-old child's deid due to saree in khammam
ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చీర
author img

By

Published : Apr 23, 2020, 8:54 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చీరతో కట్టిన ఉయ్యాల ఊగుతుండగా.. ప్రమాదవశాత్తు ఆ చీర మెడకు బిగుసుకుని ఓ ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది.

పట్టణంలోని ఎన్‌వీఆర్ కాంప్లెక్స్‌ సమీపంలో వలపర్ల రవి, కవిత దంపతుల ఏడేళ్ల కూతురు స్వర్ణిక తన చెల్లెలితో కలిసి ఇంటి వసారాలో చీరతో కట్టిన ఉయ్యాలలో ఊగుతూ రోజూ ఆడుకుంటుంది. ఈరోజు తల్లిదండ్రులు టీవీ చూస్తున్న సమయంలో చిన్నారి ఉయ్యాల ఊగుతుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు స్వర్ణ మెడకు చీర బిగుసుకుపోయి.. వేలాడుతూ ఉంది. ఆ సమయంలో ఆ రహదారి గుండా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు.

వారు వచ్చి చూసేసరికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు ఆడుకున్న తమ బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 8 నెలల గర్భిణి.. అయినా విధులకు హాజరైన ఎస్​ఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.