తెలంగాణకు చెందిన రైల్వే ఉద్యోగి కేరళలోని తిరువనంతపురంలో కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. సెంట్రల్ రైల్వే స్టేషన్ రైలు పైభాగంలో మరమ్మత్తులు చేసే సమయంలో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యాడు. కోచ్, వాగన్ డిపో అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వచనగిరి దత్తు వరంగల్ జిల్లాకు చెందిన హన్మకొండలోని బాలసముద్రం నివాసిగా గుర్తించారు.
అతను రైలు ఎక్కడానికి ఉపయోగించిన నిచ్చెన అనుకోకుండా విద్యుత్ లైన్‌ను తాకింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. రైల్వే పోలీసులు విచారణ పూర్తి చేసి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి తరలించారు. కొవిడ్ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత రేపు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి : వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరి అరెస్టు