మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు కాలనీలో వెంకన్న అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వెంకన్న పై అంతస్తుకి వెళ్లి ఎంతకూ కిందికి రాకపోవడంతో పైకి వెళ్లి చూశామని... ఉరి వేసుకొని కనిపించడంతో కిందికి దించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకన్నను పరిశీలించిన డాక్టర్లు మృతిచెందాడని చెప్పడంతో ఇంటికి తీసుకు వచ్చామని అన్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: అన్నాచెల్లి అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు