ETV Bharat / jagte-raho

యజమాని ఏటీఎంతో 12 లక్షలు డ్రా...నిందితులు అరెస్ట్

తాను పనిచేసిన ఇంటి యజమాని ఏటీఎం తస్కరించిన ఓ యువకుడు ఏకంగా 12 లక్షలు కాజేశాడు. దీనికి అతని తల్లిదండ్రులు కూడ సహకరించారు. మేడ్చల్​ జిల్లా సైనిక్​పురిలో ఉండే విశ్రాంత శాస్త్రవేత్త బ్యాంకుకు వెళ్లి ఖాతాను తనిఖీ చేయగా విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Nov 29, 2020, 9:02 PM IST

A person drwan twelve lakhs from owner account by theft debit card
యజమాని ఏటీఎంతో 12 లక్షలు డ్రా...నిందితులు అరెస్ట్

మేడ్చల్​ జిల్లా సైనిక్​పురిలో నివాసముండే విశ్రాంత శాస్త్రవేత్త ఆనంద్ ఖాతా నుంచి 12 లక్షలు కాజేశాడు ఓ యువకుడు. అతను సిండికేట్​ బ్యాంకుకు వెళ్లి ఖాతాలో ఉన్న నగదు నిల్వపై ఆరా తీయగా మోసం బయటపడింది. అతని ఇంట్లో పనిమనిషిగా చేరిన సంపత్​పై అనుమానంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితునితో పాటు సహకరించిన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.

సంపత్​ అనే యువకుడు ఆనంద్​ ఇంట్లో రెండు నెలలు పనిచేసి అక్టోబర్​లో పనిమానేశాడు. ఆ తర్వాత యజమాని ఏటీఎం తస్కరించి దశలవారీగా 12 లక్షలను నగదును డ్రా చేశాడు. దీనికి అతని తల్లిదండ్రులు కూడా సహకారం అందించారు. ఈ నెల 27న యజమాని ఆనంద్ సిండికేట్​ బ్యాంకుకు వెళ్లి ఖాతాలో నగదును తనిఖీ చేశాడు. బ్యాంకు సిబ్బంది 7 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆనంద్ ఏటీఎంపైనే రహస్య నంబరును రాయడంతో సులభంగా నగదు డ్రా చేసినట్లు సంపత్​ తెలిపాడు. అతనితోపాటు తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి:నాలుగేళ్లు ప్రేమించుకున్నారు... కానీ పెళ్లికి నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.