మానసిక క్షోభకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో జరిగింది. కొంతకాలం క్రితం ఉప్పలపు రమేష్(32)కు వివాహం జరిగింది.
అతను జులాయిగా తిరగడం వల్ల భార్య వదిలేసి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి తెగతెంపులు చేసుకున్నారు. అప్పటినుంచి ఒక్కడే ఉండేవాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చూడండి : సరకుల కోసం ఆ స్టోర్‌కు వెళితే నిలువునా దోచేస్తారు!