కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కర్రె రాం కిష్టయ్య(65) అనే వృద్ధుడిని కర్రె రాజయ్య అనే వ్యక్తి కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడగా... కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ కిష్టయ్య శనివారం రాత్రి మృత్యువాత పడ్డాడు. కొంతకాలంగా కిష్టయ్య, రాజయ్యకు మధ్య భూమి విషయంలో గొవడలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న రెండు లక్షల మంది బాధితులు