నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఆకారం గ్రామంలో.. గ్రామపంచాయతీ ట్రాక్టర్ కింద పడి తొమ్మిదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
గ్రామానికి చెందిన నాగమ్మ కుమారుడు వినయ్(9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలసి సరదాగా ఆడుకుంటున్న క్రమంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఊళ్లోని హరితహారం మొక్కలకు నీరు పోసేందుకు వచ్చింది. నడుస్తున్న ట్రాక్టరు ట్యాంకర్ పైకి ఎక్కెందుకు ప్రయత్నించిన బాలుడు.. ప్రమాదవశాత్తు దాని టైరు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: అకస్మాత్తుగా రోడ్డుపై అడ్డంగా పరుగెత్తిన బాలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం