రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో దారుణం చోటుచేసుకుంది. మామపై కోపం.. మద్యం మత్తులో తల్లి తన రెండేళ్ల కుమారుడిని గొంతుపిసికి చంపేసింది.
అసలేం జరిగిందంటే...
రామన్నగూడకు చెందిన దుంస పరమేశ్వరి మద్యానికి బానిసగా మారింది. భర్త శివకుమార్ కూలీ పని చేసేవాడు. మంగళవారం భర్త పనికి వెళ్లాడు. సాయంత్రం పరమేశ్వరి కల్లు తాగింది. అది చూసి మామ వెంకటయ్య కోడలిని మందలించాడు. అదే కోపంతో మద్యం మత్తులో తన రెండేళ్ల కొడుకు ధనుశ్కుమార్ను చేతులతో గొంతు పిసికి చంపేసింది.
చుట్టు పక్కల వారికి తెలియడంతో 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 10 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరమేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. బాబుని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు.