ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పెందుర్తిలోని అప్పన్నపాలెం గ్రామంలో పెళ్లయిన మూడు నెలలకే హరీశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న హరీశ్‌కు మేలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. ఆశాఢమాసంలో అతని భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకురావటానికి హరీశ్ తల్లి అప్పయ్యమ్మ శ్రీకాకుళం వెళ్లింది. ఇంట్లో ఎవ్వరు లేకపోవటంతో హరీశ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెళ్లైన మూడు నెలలకే భర్త చనిపోవడంతో భార్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు లేని ఆమె బంధువులు సంరక్షణలో పెరిగింది. ఇప్పుడు భర్త కూడా దూరమైపోవడంతో ఆమె రోధిస్తున్న తీరు అందిరిని కంటతడి పెట్టిస్తోంది. అసలు హరీశ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియటంలేదని కుటుంబసభ్యులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: సమస్యకు పరిష్కారం వెతుక్కున్నారు.. సొంతంగా రోడ్డు నిర్మించారు