ETV Bharat / jagte-raho

వివాహేతర సంబంధం... ఆపై అనుమానం.. చివరకు కిరాతకం - తెలంగాణ తాజా వార్తలు

ఓ మహిళతో పరిచయం... ఆమెపై అనుమానం.. మరోవ్యక్తి ప్రాణాలు బలిగొంది. తనకు పరిచయమున్న మహిళతో మాట్లాడుతున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన ఘటన పేట్​బషీర్​బాద్​ ఠాణా పరిధిలో జరిగింది.

వివాహేతర సంబంధం... ఆపై అనుమానం.. చివరకు కిరాతకం

author img

By

Published : Aug 7, 2020, 9:18 AM IST

Updated : Aug 7, 2020, 11:51 AM IST

మెదక్​ జిల్లా పేట్​బషీర్​బాద్​ ఠాణా పరిధిలో దారుణం జరిగింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. మరో వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానంతో కిరాతకంగా పొడిచి చంపాడో వ్యక్తి.

భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఓ మహిళ స్థానిక అపార్ట్మెంట్​లో వాచ్​మెన్​గా పనిచేస్తున్న తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. భర్త నుంచి విడాకులు తీసుకుని వారి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో మెదక్​లోని తమ పక్క ఊరికి చెందిన కృష్ణతో పరిచయం ఏర్పడింది. పోచమ్మ తల్లిదండ్రులు ఊరు వెళ్లినప్పుడల్లా కృష్ణ వస్తుండేవాడు.

అదేక్రమంలో గురువారం రాత్రి సమయంలో పోచమ్మ ఇంటికి వచ్చిన కృష్ణ... ఆమె అదే అపార్ట్​మెంటులో సెంట్రింగ్​ పనిచేస్తున్న మాధవరావుతో మాట్లాడడం చూసి అతడిని కత్తితో పొడిచి చంపాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఆసుపత్రి వైద్యులే 'ఆ నలుగురు'గా మారి అంత్యక్రియలు

Last Updated : Aug 7, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.