ETV Bharat / jagte-raho

ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి

author img

By

Published : Nov 30, 2020, 5:07 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కుమారస్వామి ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఓ వ్యక్తి తనను చంపుతానని బెదిరిస్తున్నాడని లిఖితపూర్వకంగా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

A man who complained to the police that there was a threat to life in nizamabad district
ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి

భూమిని కబ్జా చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఓ వ్యక్తి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కుమారస్వామి ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఓ రాజకీయ పార్టీకి చెందిన సాయిప్రసాద్​, అతని కుమారుడు భూమిని దున్నుతుండగా తనపై దాడి చేశారని ఆరోపించారు.

మదనపల్లి రహదారి పక్కనే ఉన్న భూమిని కబ్జా చేసి తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతున్నారని కుమారస్వామి పోలీసుల ఎదుట వాపోయారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించి తన భూమిని ఇప్పించవల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్​ బెట్టింగ్​ కేసులో.. అనిశా అధికారుల దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.