ETV Bharat / jagte-raho

భార్యకు కరోనా.. అవమానంతో భర్త ఆత్మహత్య!

భార్యకు కరోనా పాజిటివ్... వీధిలోకి వెళ్తే సూటిపోటి మాటలతో అవమానం. ఇలాంటి పరిస్థితిని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది.

భార్యకు కరోనా.. అవమానంతో భర్త ఆత్మహత్య!
భార్యకు కరోనా.. అవమానంతో భర్త ఆత్మహత్య!
author img

By

Published : Jul 28, 2020, 5:45 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఆశ వర్కర్​గా పని చేస్తోంది. ఆమెకు కరోనా సోకగా...ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉంటుంది. భర్త భాస్కర్ రావు ఎక్కడికి వెళ్లినా తెలిసిన వారు అతని భార్య గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారని మిత్రులతో గోడు చెప్పుకున్నాడు. అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్యనా? లేక ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఉంటాడా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవీ చూడండి-దారుణం... చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.