ETV Bharat / jagte-raho

ప్రాణం తీసిన ఆవేశం - lorry

ఓ వ్యక్తి ఆవేశం మరో వ్యక్తిని బలిగొంది. చిన్న మాట అన్నందుకు ఆవేశంతో ఘర్షణకు దిగి ప్రాణం తీశాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగింది.

రహీం నడిపిన లారీ
author img

By

Published : May 1, 2019, 4:58 PM IST

మహ్మద్​ రహీం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​కు లారీ నడుపుకుంటూ వస్తున్నాడు. ఇవాళ ఉదయం బెల్లంపల్లి రైల్వే వంతెన వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో బైక్​పై వస్తున్న వ్యక్తి లారీని ప్రమాదకర స్థితిలో దాటపోయాడు. లారీ డ్రైవర్ రహీం చస్తావా అంటూ బైకిస్ట్​ను గద్దించాడు. అంతే..బైక్​పై వెళ్తున్న వ్యక్తి రెచ్చిపోయాడు. లారీని వెంబడించి రహీంతో ఘర్షణకు దిగాడు. లారీ డ్రైవర్​ చాతీపై కొట్టడం వల్ల రహీం అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇవీ చూడండి: కాళేశ్వరంలో ఒక్క పంప్... 35వేల మోటార్లకు సమానం

ప్రాణం తీసిన ఆవేశం

Intro:రిపోర్టర్ పేరు: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్ : 9949620369
tg_adb_81_01_lorry_driver_mruthi_avb_c7
ప్రాణం తీసిన యువకుడి ఆవేశం
లారీ నడుపుకుంటూ ఎంతో దూరం నుంచి వస్తున్న డ్రైవర్ ప్రాణాలను ఓ యువకుడి ఆవేశం బలిగొంది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు మహ్మద్ రహీం లారీ నడుపుకుంటూ ఈ రోజు ఉదయం వెళ్తున్నాడు. బెల్లంపల్లి రైల్వే పై వంతెన టి రోడ్ వద్దకు చేరుకోగానే ఓ ద్వి చక్ర వాహనం మీద వ్యక్తి లారీ ముందు నుంచి వెళ్లబోయాడు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ మహ్మద్ రహీం అంత తొందర ఎందుకు చస్తావ్ అంటూ అరిచాడు. ఇది విన్న ఆ వ్యక్తి లారీని వెంబడించి రైల్వే స్టేషన్ పిట్రోల్ బంక్ వద్ద రహదారిపై అడ్డంగా ద్విచక్ర వాహనం నిలిపి డ్రైవర్ ను కిందకు దించి గొడవకు దిగాడు. ఇద్దరు వాదులాడుకున్నారు. క్లినర్ ఇద్దరికి సర్ది చెప్పాడు. అయిన వినకుండా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి రహీం ను బలంగా చాతీ పై కొట్టాడు. ఆ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన ఆ వ్యక్తి పారిపోయాడు. సిఐ నరేందర్ చేరుకుని ఆ సమయంలో అక్కడున్న యువకులను ప్రశ్నించారు. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ బాలుజాదవ్ ఆసుపత్రికి చేరుకుని క్లినర్ ఎండి.ఫయాజ్ ను విచారించారు. సీసీ ఫుటేజీ చూసి నిందితున్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Body:బైట్
ఎండి. ఫయాజ్, లారీ క్లినర్

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.