మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఆలూర్ గ్రామానికి చెందిన లోలం రాజేశ్వర్ తాగుడుకు బానిసై ఏ పని చేయకుండా తిరుగుతుండటంతో భార్య రాధ పలుమార్లు మందలించింది.
పంట చేనుకు వెళ్లగా ..
శుక్రవారం పంట చేనులో ఎరువులు వేద్దామని భార్య చెప్పటంతో రాజేశ్వర్ ఇంట్లో నుంచి గొడవ పడి బయటకు వెళ్లాడు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చుట్టు పక్కల వెతికారు. ఉదయం పంట చేనుకు వెళ్లగా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్ నర్సింహ్మ రెడ్డి వివరించారు.
ఇదీ చదవండి:యాసంగి నుంచి కొనుగోలు కేంద్రాల రద్దు: నిరంజన్ రెడ్డి