ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామ ప్రధాన కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. బ్లేడ్‌తో తన కాళ్లు, చేతులు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువకుడి దగ్గరకి వెళ్లడానికి స్థానికులు కొంతసేపు భయపడ్డారు. అనంతరం వారు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది స్ధానికుల సాయంతో యునకుడికి వైద్య సాయం అందించి బంధువులకు సమాచారం అందించారు.
యువకుడి పేరు సాయి అని... ఒక హోటల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం