ETV Bharat / jagte-raho

'గోదావరి నదిలో స్నానానికి వెళ్లి.. శవమై తిరిగొచ్చాడు' - Accident in Manthani

కార్తీక సోమవారం సందర్భంగా గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది.

A man drowned in the Godavari river
'గోదావరి నదిలో స్నానానికి వెళ్లి.. శవామై తిరిగొచ్చాడు'
author img

By

Published : Nov 23, 2020, 4:49 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది తీరానికి మంథని మండలం తోటగోపయ్యపల్లి గ్రామానికి చెందిన బొందుగుల రాజేందర్​ అనే వ్యక్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి స్నానం చేయడానికి వచ్చారు. ముందుగా రాజేందర్​ నదిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అక్కడిక్కడే మృతి చెందాడు.

తల్లిదండ్రుల కళ్ల ముందే కన్నకొడుకు చనిపోతుంటే.. ఆ తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. వెంటనే మృతదేహాన్ని మంథని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.