నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఒత్తుగుండ్ల గ్రామానికి చెందిన ఖాజా(26) విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్సై భగవంత రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్ గ్రామానికి చెందిన జరీనా బేగంతో ఖాజా అనే వ్యక్తికి వివాహం జరిగింది. భార్యతో కలిసి స్వగ్రామంలో ఉంటున్న అతడు.. బంధువులతో కలిసి ఆదివారం రాత్రి దేవరకద్ర మండలంలోని పేరూరు గ్రామం అటవీ ప్రాంతంలో కుందేళ్ల వేటకు వెళ్లారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన నర్సింలు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ విద్యుత్ తీగతో కంచె వేశాడు. అదే పొలంలో వేటకు వెళ్లిన ఖాజా కాళ్లకు కరెంట్ తీగ తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవాళ బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై భగవంత రెడ్డి తెలిపారు. ఖాజా మృతితో బాలకిష్టాపూర్, ఒత్తుగుండ గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: 'వారి కోసం రంగంలోకి దిగిన మూడు విభాగాలు'