ETV Bharat / jagte-raho

పరిశ్రమలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి - balanagr news

హైదరాబాద్​ ఫతేనగర్​లో విషాదం చోటుచేసుకుంది. ఐదు రోజుల కింద కురిసిన వర్షానికి మరో ప్రాణం బలైంది. ఐదు రోజుల తర్వాత తీసిన పరిశ్రమలోని మిషన్​ ఆన్​ చేయగా... కరెంట్​ షాక్​ తగిలి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

a man died with current shock in fathe nagar

author img

By

Published : Oct 18, 2020, 10:48 PM IST

ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఇవాళ విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ బాలానగర్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఫతేనగర్​కు చెందిన వెంకట నాయుడుకి బాలానగర్​లోని ఓ చిన్న ఇంజినీరింగ్ పరిశ్రమ ఉంది. బుధవారం పడిన భారీ వర్షానికి తన పరిశ్రమలోకి నీరు చేరటం వల్ల మూసేశాడు.

శనివారం పరిశ్రమలోకి వెళ్లి నీటిని ఎత్తిపోసి... శుభ్రం చేసుకున్నాడు. తిరిగి పరిశ్రమకు వెళ్లి మిషన్ ఆన్ చేయగా... ఒక్కసారిగా కరెంట్​ షాక్​ తగిలి కిందపడ్డాడు. సమాచారం అందుకున్న తన భార్య హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కొరియర్​ బాయ్​ని కాపాడేందుకు... ఓ ఇంట్లో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.