మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ శ్రీనివాస కాలనీకి చెందిన ఎండీ నూర్జహాన్ పని నిమిత్తం ఘట్కేసర్ మండలం యంనంపేటకు వెళ్లి... తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక రైల్వే వంతెన వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తిస్తామని సీఐ చంద్రబాబు తెలిపారు.
ఇదీ చూడండి: 'మరీ ఇంత దారుణమా... డబ్బు కట్టేవరకు చనిపోయారనే చెప్పరా..?'