మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్కు సమీపంలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. సాయిరాం ఏజెన్సీస్లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక వాహనం మరో చోటికి వెళ్లడం వల్ల జడ్చర్ల నుంచి వాహనాన్ని రప్పించారు.
దుకాణానికి వెనకభాగంలో అంతకుముందు అంటుకున్న మంటలే క్రమంగా దుకాణంలోనికి వ్యాపించాయని స్థానికులు తెలిపారు. దుకాణంలో 50లక్షల విలువైన సామాగ్రి ఉంటుందని... అంతా కాలిపోయిందని యజమాని చంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మంటలు అదుపులోకి రావడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: అపోలో టైర్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం