మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు(30) అనే యువరైతు అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె కాలికి తగిలి మృతి చెందాడు. పొలంలో కట్టేసిన గేదెలకు పాలు పితకడానికి అని వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యవాత పడ్డాడు.
ఈవార్త విన్న అతని కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు. రామాయంపేట పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్.. రూ. 45 లక్షలు డిమాండ్!