ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణం కొవ్వూరుగూడెంలో విశ్రాంత ఉపాధ్యాయుడు కల్వకుర్తి నాగేశ్వరరావు గత ఐదేళ్లుగా జపాను షాపర్డుకు చెందిన ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి రాయ్ అనే పేరు పెట్టారు. శుక్రవారం రాత్రి.. నాగేశ్వరరావు ఇంటి ఆవరణలోకి ఓ త్రాచుపాము ప్రవేశించింది. గుర్తించిన శునకం.. దానితో పోరాటం చేసి పామును చంపేసింది. ఈ క్రమంలో పాము కాట్లతో శునకం కూడా కొద్దిసేపటికే మృతిచెందింది.
ప్రేమగా పెంచుకున్న శునకం చనిపోవడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీచూడండి: 14 రోజుల పసికందును భవనంపై నుంచి పడేసిన తల్లి